సైంధవులు ఎవరో చెప్పండి

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల నగర పంచాయతి అభివృద్ది పనులకు కొందరు సైంధవులు అడ్డుపడుతున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పడం శోచనీయమని, సైంధవులు ఏవరో మంత్రి స్పష్టం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్‌ దాసరి సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేక‌రుల‌తో మాట్లాడారు. ఎర్రగుంట్ల ప్రజలకు మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ఎర్ర‌గుంట్ల‌ మున్సిపాలిటీలో 16 మంది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు కొనసాతుండగా, తమ పార్టీలో నలుగురు మాత్రమే ఉన్నారని విషయం గుర్తు చేశారు. అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు ఉన్నప్పటికి అధికార పార్టీ సభ్యులు రెండు వర్గాలు వ్యవహరిస్తున్న విషయాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి దాటి వేసి ఇతరులపై నిందలు వేయడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర మంత్రి గా కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డి ఎర్రగుంట్ల మున్సిపాల్టీ పట్ల నిర్లక్ష్య దోరణితో ఉండడం బాధకరమన్నారు. టీడీపీ నేతల మధ్య ఆదిపత్య పోరు కారణంగా మున్సిపాల్టీలో అభివృద్ధి పనులు నిలిచి పోయిన విషయాన్న ప్రజలు గుర్తుంచాలని తెలిపారు. అధికారమే పరమావధిగా సంపాదనే మార్గంగా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణుల పనితీరులో మార్పు రావాలని లేనిపక్షంలో భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. స్వార్థ పరులకు పనితీరుకు వ్యతిరేకంగా ఉధ్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజాసమస్యలపై అఖిల పక్షలు, వామపక్షాలు వైయ‌స్ఆర్‌ సీపీతో సహా కలిసి ఆంధోళనలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ముందుగా టీడీపీ నియోజకవర్గ స్థాయి నేతల మధ్య ఉన్న ఆదిపత్య పోరుపై దృష్టి సారించి ఆ తరువాత వివక్ష పార్టీలపై విమర్శలు చేయాలని ఆయన హితవు పలికారు. స్వపక్షంలోనే విరోధులను పెంచి పోషించుకుంటున్న మంత్రి ఆది, తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఎర్రగుంట్ల మున్సిపాల్టీ కౌన్సిలర్లు నేతల ఆదిపత్య పోరులో తలదూర్చకుండా అభివృద్ధిపై దృష్టి సారిస్తే పలితం ఉంటుందని ఆయన సూచించారు.  

Back to Top