జన్మభూమి కమిటీలను రద్దు చేస్తా
చిత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్థానికి సంస్థల ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం సర్పంచ్‌ల విధులను కాలరాస్తుందని ఫిర్యాదు చేశారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా మారాయని, పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన వైయస్‌ జగన్‌ జన్మభూమి కమిటీలను రద్దు చేసి ప్రతి గ్రామంలో విలేజ్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి ఏ పథకం కావాలన్నా..72 గంటల్లోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.


  
Back to Top