తిరుమలనాథస్వామి ఆలయంలో ఎమ్మెల్యే సురేష్‌ పూజలు

రాజంపల్లె (పెద్దారవీడు): మండలంలోని రాజంపల్లె సమీపంలో వెలసిన గొడ్రాలికొండ తిరుమలనాథస్వామి ఆలయంలో యర్రగొండపాలెం సమన్వకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే అదిమూలపు సురేష్‌ ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు భవానీప్రసాద్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. సాంబిరెడ్డి, ఏర్వ బాలకోటిరెడ్డిలు ఎమ్మెల్యేను పూలమాల, దుశ్శాలువతో సన్మానించారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు దుగ్గెంపూడి వెంకటరెడ్డి, వై పాలెం మాజీ ఎంపీపీ ఎం.బాలగురవయ్య, మాజీ సర్పంచ్‌ బొచ్చు సుబ్బారెడ్డి, అక్కిరెడ్డి, గాలి రమణారెడ్డి, మారంరెడ్డి క్రిష్ణరెడ్డి, రామచంద్రుడు, వెంకటేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, తిమ్మరాజు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Back to Top