కౌన్సిలర్ ఉపఎన్నికలో తప్పక విజయం సాధిస్తాం

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని కొత్తవలస 7వ వార్డులో ఆదివారం జరగనున్న కౌన్సిలర్‌ ఉప ఎన్నికలో వైయస్సార్‌సీపీ అభ్యర్ధి కొండపల్లి బాలక్రిష్ణ తప్పక విజయం సాధిస్తారని వెయస్సార్‌సీపీ ఉత్తరాంధ్రా జిల్లాల కన్వీనర్‌ కోలగట్ల వీరబధ్రస్వామి అన్నారు. శుక్రవారం పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక నాయకులతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. అధికారం కోసమో,ప్రభుత్వం వద్ద మెప్పు పొందడం కోసమో ఓటర్లను భయపెట్టడం సరికాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పీర్టీ నాయకులు వార్డు పరిధిలో ఉన్న చిరు వ్యాపారులను, ఫించన్‌దార్లును భయపెట్టి చౌకబారు రాజకియాలకు దిగజారడం మంచిపద్దతి కాదని ఆయన అన్నారు. మహిళలను చులకన చేస్తూ మాట్లాడడమే కాకుండా వారిని బెదించి అప్రజాస్వామికంగా వ్యవహిరించడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికార పార్టీ నేతలు నెరవేర్చలేక ప్రజాధారణకు దూరమయ్యారని... ప్రస్తుతం ప్రజలు వారిని చీత్కరిస్తుంటే భరించలేక బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. 7వ వార్డు ప్రజలు చాలా తెలివైన వారని ఎన్ని బెదిరింపులు చేసినా,ఒత్తిడి తెచ్చినా వారికి నచ్చిన వారికే ఓటు వేసి గెలిపిస్తారని అన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా నాయకులు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)మాట్లాడుతూ 7వ వార్డు ప్రజలు వైయస్సార్‌సీపీ అభ్యర్ధిని గెలింపించడానికి సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.తమ అభ్యరిధని గెలిపించుకోవడానికి ప్రజలు అధికార పార్టీ నేతలు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు.మా అభ్యరిధని భయపెట్టినా,కార్యకర్తలను భయపెట్టినా,పోలీసులు చేత సోదాలు చేయించి భయపెట్టినా ఏ ఒక్కరూ వెనకడుగువేయకుండా ముందుకు దూసుకుపోతున్నారని అన్నారు.రానున్న ఎన్నికలో ప్రజలు తప్పక బాలక్రిష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌మాట్లాడుతూ జిల్లా నాయకత్వం అందిస్తున్న సహకారంతో అధికార పర్టీ నాయుకుల ఒత్తిళ్లను,బెదిరింపులను తట్టుకుని ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయని ఆయన అన్నారు.7వ ప్రజలు వైఎస్సార్‌సీపీకి మంచి ఆధారణ చూపిస్తున్నారని అన్నారు.ఓటమి భయంతో ప్రజలను భయపెడుతున్నా ప్రజలు మాత్రం అవన్నీ మనసులో పెట్టుకుని ఓటుతో తీర్పు చెప్పడానికి సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు.అభ్యర్ధి కొండపల్లి బాలక్రిష్ణ మాట్లాడుతూ వార్డులో ప్రజలు చూపిస్తున్న ఆధరణతో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌కార్యదర్శి గర్భాపు ఉదయబాను,జోన్నాడ శ్రీదేవి,చుక్క లక్ష్మునాయుడు,మంత్రి రవికుమార్,ఎస్‌.శ్రీనివాసరావు,గొల్లు వెంకట్రావు,కేతిరెడ్డి రాఘవకుమార్,దేవీ ధాట్రాజ్,పాత గోవింద్,నాగేశ్వరరావు,గొట్టా శివ,రణభేరి బంగారి నాయుడు,పాలవలస మురళీకృష్ణ,కె.వెంకటర్రావు,దత్తి శ్రీనివాసరావు,పాలూరు శంకర్,వి.తిరుపతి,ఎం.సాంబమూర్తి,ఏ.సంజీబునాయుడు,డి.ధ
Back to Top