నిరుద్యోగుల‌కు అండ‌గా..!

నిరుద్యోగుల్ని చంద్ర‌బాబు మోసం చేసిన వైఖ‌రిని ఖండిస్తూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్  జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న ఎన్నిక‌ల హామీని చంద్ర‌బాబు తుంగ‌లోకి తొక్కార‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. లేదంటే నిరుద్యోగ భృతి క‌ల్పిస్తామ‌న్న మాట‌ల్ని ఆయ‌న గుర్తు చేశారు. నిరుద్యోగుల‌కు న్యాయం చేసేలా ప్ర‌భుత్వం మీద ఒత్తిడి చేసేలా మ‌నమంతా క‌లిసి క‌ద‌లుదాం అని వైఎస్ జ‌గ‌న్ ట్వీటర్ ద్వారా పిలుపు ఇచ్చారు.
Back to Top