మే 2 నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర


 విశాఖపట్నం : ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వీ విజయసాయి రెడ్డి మే 2వ తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ నేత మళ్లా విజయప్రసాద్‌ తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 72 వార్డుల్లో 10 రోజుల పాటు 180 కిలోమీటర్లు విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నయవంచనకు నిరసనగా నగరంలోని ప్రభుత్వ మహిళా కాలేజీ ఎదురుగా ఉన్న దీక్షా ప్రాంగణం వేదికగా ఈ నెల 30వ తేదీన నయవంచన దీక్షలు చేయనున్నట్టు విజయప్రసాద్‌ వెల్లడించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరవుతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తరిమినట్లే తెలుగుదేశం పార్టీని కూడా ప్రజలు తరిమికొడతారని చెప్పారు. 

Back to Top