ప్రభుత్వ సహకారంతోనే

– పోలీసుల అండదండలతో చెలరేగుతున్న దొంగలు
– అడ్డంగా దొరికిపోయిన ఎస్పీకి పదోన్నతా..?
– డ్వాక్రా మహిళల ఖాతాలో రూ. లక్ష జమ చేసేదెప్పుడు
– వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: ఎ్రరచందనం అక్రమ రవాణాను అరికట్టి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. లక్షన్నర జమ చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు మాటలకు చేసే పనులకు తీవ్ర వ్యత్యాసం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ సహకారంతోనే ఎ్రరచందనం అక్రమ రవాణా జరుగుతుందని ధ్వజమెత్తారు.  మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన∙విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎ్రర చందనం స్మగ్లర్లకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తూ సరఫరాకు సహకరిస్తుందని ఆరోపించారు. డ్వాక్రా మహిళల అకౌంట్‌లో లక్ష రూపాయలు వేస్తానన్న చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎ్రరచందనం స్మగ్లింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం స్మగ్లర్ల కోసమే పనిచేస్తుందని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో 11 లక్షల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎ్రర చందనం విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని ప్రభుత్వమే చెప్పిన మాట నిజం కాదా అని భూమన ప్రశ్నించారు. శేషాచలం అడవుల్లోకి ప్రభుత్వం ఇప్పుడు పాత్రికేయులను వెంటబెట్టుకుని వెళ్లిన కనీసం 5వేల మంది కూలీలు చెట్లను నరుకుతూ కనిపిస్తారని ఆయన సవాల్‌ విసిరారు.

టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు అధికారాలెక్కడివి
ఎ్రర చందనం స్మగ్లర్ల పీచమణుస్తామని రెండేళ్ల క్రితం టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఐదు నెలల కిందట వరకు అధికారాలు కట్టబెట్టలేదని భూమన ఆరోపించారు. టీమ్‌లో ఉన్న ఒక టీఐజీ, ముగ్గురు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు కే వలం ఎ్రర చందనం స్మగ్లర్లు తీసుకొచ్చే దుంగలకు రక్షణ కల్పించడానికే తప్ప ప్రకృతి సంపదను కాపాడుకోవడానికి కాదని ఎద్దేవా చేశారు. ప్రతిరోజూ దాదాపు వంద కోట్ల విలువైన ఎ్రర చందనం చెన్నై, బొంబాయి పోర్టుల ద్వారా చైనా, జపాన్‌లకు తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మామూలు కలప పేరుతో తరలిస్తుండగా చిన్న చట్ట సవరణతో దీనికి ముగింపు పలకవచ్చని సూచించారు. ఎ్రర చందనం తరలింపులో పోలీసులే దొంగలకు సహకరిస్తున్నారని సాక్షాత్తు ఐజీ కాంతారావు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా భూమన పేర్కొన్నారు. తుప్పు పట్టిన పనికిరాని తుపాకులు పోలీసులకిచ్చి పహారా కాయమంటేనే ఎ్రర చందనం రక్షణపై చంద్రబాబు చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. 450 మందిని నియమిస్తామని చెప్పి కేవలం 150 మందితో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసిన చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కారుల్లో ఎ్రర చందనం తరలిస్తూ ఎస్పీ దొరికిపోయినా ఎస్సైని సస్పెండ్‌ చేసి దొరికిపోయిన వ్యక్తికి పదోన్నతి కల్పించడం దారుణమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ లక్ష కోట్లు ఉంటే ఎ్రరచందనం విలువ రూ. 40 లక్షల కోట్లుగా ఉందని భూమన కరుణాకర్‌రెడ్డి∙పేర్కొన్నారు.
Back to Top