శుక్రవారం షర్మిల పాదయాత్ర సాగేదిలా

గుంటూరు 22 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్ర శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలో సాగుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి గాంధీనగర్, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, మంచికలపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం మోరంపూడి, పేరికలపూడి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

Back to Top