విజయనగరం:
త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని భూస్థాపితం చేయడం ద్వారా అరాచక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బొబ్బిలి దర్బార్ మహల్‌లో బుధవారం జరిగిన వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ కృష్ణ రంగారావు, జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బేబినాయన హాజరయ్యారు.
బొబ్బిలిలో తాము ఇచ్చిన మెజార్టీతోనే బొత్స కుటుంబం రెండు సార్లు ఎంపీ పదవి పొందిందని సుజయ కృష్ణ రంగారావు అన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే మెజార్టీని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా బొత్సను రాజకీయ సన్యాసం చేయిద్దాం అని పిలుపునిచ్చారు. తాము రాజకీయాల్లో ఉన్నంతకాలం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. భవిష్యత్‌లో కూడా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితోనే కొనసాగుతాం అని నేతలు స్పష్టం చేశారు. రానున్న బొబ్బిలి యుద్ధంలో విజయం వైయస్ఆర్‌సీపీదే అని బేబినాయన ధీమా వ్యక్తం చేశారు.