సుజనాచౌదరిని అరెస్ట్ చేయాలి

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ కూడా యువత, ప్రజాసంఘాలు ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరి హోదా ఉద్యమాన్ని కించపరిచేలా కోళ్లపందేలు, పందుల పోటీలు నిర్వహించుకోవాలంటూ ఎగతాళి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. తక్షణం సుజనా చౌదరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Back to Top