ప్ర‌త్యేక హోదా కోరుతూ ఆత్మాహుతి య‌త్నం


ఏలూరు) ప్ర‌త్యేక హోదా కోరుతూ మ‌రో వ్య‌క్తి ఆత్మాహుతికి య‌త్నించాడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు మండ‌లం కైక‌రం కు చెందిన దుర్గా ప్ర‌సాద్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ కి వెళ్లిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదా సాధించుకొని వ‌స్తాడ‌ని ఎదురు చూశాడు. రాత్రంతా టీవీ ముందే గ‌డిపాడు. ప్ర‌త్యేక హోదాను గాలికి వ‌దిలేసి చంద్ర‌బాబు ప్యాకేజీ గురించి మాట్లాడుతుండ‌టంతో హోదా రాదేమో న‌న్న బాధ‌తో త‌ల్ల‌డిల్లిపోయాడు. దీంతో అర్థ‌రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. మంట‌ల్ని గ‌మ‌నించిన స్థానికులు తాడేప‌ల్లిగూడెం ఏరియా ఆసుప‌త్రికి త‌రలించారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరు, ఆ త‌ర్వాత గుంటూరు లోని జీజీహెచ్ కు త‌ర‌లించారు. 
ఫోన్ లో జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌
ప్ర‌త్యేక హోదా కోసం ఆత్మాహుతి య‌త్నం చేసిన ప్ర‌సాద్ ను ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఫోన్ లో ప‌రామ‌ర్శించారు. ధైర్యంగా ఉండాల‌ని భ‌రోసా ఇచ్చారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని మాట ఇచ్చారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని, అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవ‌నెత్తుతామ‌ని ఆయ‌న అన్నారు. 
Back to Top