నష్టాల ఊబిలో చక్కెర కార్మాగారాలు


ప్రభుత్వ విధానాలతో కష్టాల్లో రైతులు, కార్మికులు

విజయనగరంః టీడీపీ ప్రభుత్వం విధానాలు రైతులు,కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ గజపతినగరం సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య మండిపడ్డారు. టీడీపీ పాలనలో చక్కెర కార్మాగారాలు మూతపడుతున్నాయన్నారు. మూతపడిన భీంసింగ్‌ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారని, మాట ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీని తెరిపించి రాయితీలు ఇచ్చారని గుర్తుచేశారు. తర్వాత టీడీపీ హయాంలో చక్కెర కార్మాగారాలు మూతపడుతున్నాయన్నారు. ఫ్యాక్టరీలు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.ఫ్యాక్టరీలు నడపాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని,బినామీలకు విక్రయించాలనే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కనీసం చెరుకుకు మద్దతు ధర కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదని ఆగ్రహవ్యక్తం చేశారు.జిల్లాలో 10వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు,కార్మికుల్లో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితేనే మేలు జరుగుతుందని రైతులు, కార్మికులు భావిస్తున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top