గిట్టుబాటు ధర లేక అప్పులపాలువుతున్నాం

విశాఖపట్నం: కనీస మద్దతు ధర లేక అప్పులపాలవుతున్నామని చెరుకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చెరుకు రైతులు కలిశారు. ఈ మేరకు జననేత వారితో మాట్లాడి పంట పెట్టుబడి, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ. 70 నుంచి 80 వేలు అవుతుందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదన్నారు. క్వింటాకు రూ. 2800 ఉంటే ఫ్యాక్టరీల యాజమాన్యాలు రూ. 2100 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. తమను న్యాయం చేయాలని చెరుకు రైతులు జననేతను కోరారు. 

 ఆరు నెలలు నుంచి జీతాలు రావడంలేదు..!
ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారం కార్మికులు  పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. వైయస్‌ హయాంలో  తమకు మేలు జరిగిందని, ప్రస్తుతం టీడీపీ  హయాంలో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు కోరారు. ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుందని, ఆరు నెలల నుంచి జీతాలు రాక ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. షుగర్‌కు మద్దతు ధరలేదని, పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.  జిల్లాలో నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయని, గతంలో  వైయస్‌ఆర్‌  ఆదుకుని రైతులు,కార్మికులకు అండగా నిలబడ్డారన్నారు. 


Back to Top