వైయస్‌ జగన్‌ను కలిసిన షుగర్‌ ఫ్యాక్టరీ రైతులు


పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని జయపూర్‌ షుగర్స్‌ చాగల్లు రైతులు కలిశారు. సోమవారం కొవ్వూరు నియోజకవర్గంలో వారు జననేతను కలిసి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని, మరో ఏడాది ఓపిక పడితే మంచి జరుగుతుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సహకార రంగంలో ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా రెండు షుగర్‌ ఫ్యాక్టరీలను మూత వేయిస్తే..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వాటిని తెరిపించి రైతులకు తోడుగా నిలిచారన్నారు. మహానేత మరణాంతరం మళ్లీ ఆ పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. జననేత హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top