ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయండి

గొల్లపాలెం(కాజులూరు): వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలను పూర్తిస్థాయిలో విజయవతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని ఆ పార్టీ సిజేసి సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కార్యకర్తలకు కోరారు. కాజులూరులో జరిగిన వైఎస్సార్‌సీపీ నేత, డిసిసి మాజీ డైరెక్టర్‌ పెంకే సత్యనారాయణ మనుమరాలు పావని రజస్వల వేడుకలలో బుధవారం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ మండల కన్వీనర్‌ కొప్పిశెట్టి వీరభద్రరావు తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్బంగా కొద్దిసేపు ఆయన కార్యకర్తలతో ముచ్చటించారు. ప్లీనరీ సమావేశాలను మూడంచెలలో నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. తొలివిడతలో బాగంగా ప్రస్తుతం నియేజకవర్గ కేంద్రాలలో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. త్వరలో ఈ నెల 17, 18, 19 తేదిలలో జిల్లా కేంద్రమైన కాకినాడలో రెండవ దశ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయన్నారు. జూలై ఎనిమిదవ తేదిన వైఎస్సార్‌ జయంతి పురస్కరించుకుని విజయవాడలో తుది దశ సమావేశం జరుగుతుందన్నారు. నియేజకవర్గ కేంద్రమైన రామచంద్రపురంలో జరిగిన ప్లీనరీ సమావేశానికి కాజులూరు మండల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగనున్న ప్లీనరీ సమావేశాలలోనూ అధికసం్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దంగేటి అరుణ్‌కుమార్, మాత నూకరావు, పెదిరెడ్డి వెంకన్న, పెంకే విశ్వేర్వరరావు, అప్పారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top