రానున్న ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీదే విజ‌యం

జి.కొండూరు: రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని పార్టీ మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త జోగి ర‌మేష్ అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు మందా జక్రధరరావు (జక్రి) ఆధ్వర్యంలో మండల పార్టీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా నూతన వైస్ ఎంపీపీగా చెవుటూరు ఎంపీటీసీ పుప్పాల సుబ్బారావును ఎన్నుకున్నారు. పార్టీ ఒప్పందం ప్రకారం వెల్లటూరు ఎంపీటీసీ మారాసి కోటయ్య స్వతహాగా రాజీనామా చేయగా పుప్పాల సుబ్బారావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన జోగి రమేష్ ఇరువురిని స‌న్మానించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. గ‌త మూడు సంవత్సరాలుగా మారాసి కోటయ్య వైస్ ఎంపీపీగా పార్టీకి విశేష సేవలందించారన్నారు. అదే బాటలో పుప్పాల సుబ్బారావు కూడా సమర్థ‌వంతంగా పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వ‌హించిన సర్వేలో వచ్చే ఎన్నికలో వైయ‌స్సార్‌సీపీ విజయం సాధిస్తుందని తేలిందన్నారు. వచ్చేది రాజన్నరాజ్యమని ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తానని జోగి రమేష్‌పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top