<br/>హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపీల విదుల్ని కాలరాస్తోందని, ఈ పనితీరు మార్చుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకొంటామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆరోగ్య మిషన్ మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ లుగా లోక్ సభ సభ్యుల్ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో కొందరు వైఎస్సార్ సీపీ ఎంపీల పేర్లను తొలగించి, టీడీపీ ఎంపీల పేర్లను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఉత్తర్వులను తప్పు పడుతూ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని ఆయన వెల్లడించారు. దీని మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి న్యాయపరమైన నోటీసు ఇస్తామని ఆయన వివరించారు.