సబ్‌ప్లాన్‌ నిధులు అమలుకు నోచుకోవడం లేదు

ఏపీ అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా అమలు కావడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. సభలో ఆయన మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు పెట్టి ఎంత వరకు వారికి ఉచిత కరెంట్‌ అందజేస్తున్నారో ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. అనేక గ్రామాలకు ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్లలోపు ఉచిత కరెంట్‌ను సరిపోదని దాన్ని 200లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు ప్రతి సంవత్సరం రూ. 58 కోట్లు, ఎస్టీలకు కేవలం రూ. 18 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారన్నారు. ఉచిత విద్యత్‌లో కేంద్ర ప్రభుత్వం స్కీం కూడా ఉందని చెప్పారు. కేంద్ర దీనదయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ యోజన స్కీం ద్వారా సబ్సీడీ ఎంత వరకు భరిస్తోంది మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు ద్వారా వారి ఇంటికి వెలుగులు కూడా అందించలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఉండదన్నారు. ఉచిత కరెంట్‌ ద్వారా ఎన్ని కుటుంబాలకు లబ్ది చేకూరుతుందనేది మంత్రి సమాధానం చెప్పాలన్నారు. 

Back to Top