ప్ర‌తిప‌క్షాల్ని వేధించ‌ట‌మే ల‌క్ష్యం..!


హైద‌రాబాద్‌) తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన
నాటి నుంచి ప్ర‌తిప‌క్షాల్ని వేధించ‌ట‌మే లక్ష్యంగా ప‌నిచేస్తూ వ‌స్తోంది. ముఖ్య‌మంత్రి  చంద్రబాబు నాయుడు, ఆయ‌న బాట‌లో ప‌చ్చ చొక్కాలు ఈ
బాట‌లో చెల‌రేగిపోతున్నారు. తాజాగా న‌గ‌రి మునిసిప‌ల్ ఛైర్మ‌న్ కుటుంబంపై జ‌రిగిన దాడి ఈ వైఖ‌రికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా
నిలుస్తోంది.

అధికారులే సూత్ర ధారులు- వైఎస్సార్ జిల్లా యే
ఉదాహ‌ర‌ణ‌

ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అధికారుల
నియామకంలో తెలుగుదేశం స్వార్థ పూరితంగా వ్యవహరించింది. ప్రతిపక్ష పార్టీల్ని వేధించేందుకు
అనువుగా ఉండే అధికారుల్ని ఏరికోరి నియమించింది. ఉదాహరణకు వైఎస్సార్ జిల్లాలో ప్రజలు
పూర్తిగా వైఎస్సార్ సీపీ కి పట్టం కట్టారు. అది మనస్సులో పెట్టుకొన్న చంద్రబాబు కేవీ
రమణ అనే వివాదాస్పద అధికారిని కలెక్టర్ గా నియమించారు. ఎమ్మెల్యేలకు ఎటువంటి విలువ
ఇవ్వకుండా, వారిని అవమానించటమే లక్ష్యంగా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. దీంతో ప్రజలకు
సంబంధించిన పనులు ఏమాత్రం పరిష్కారం కావటం లేదు. ఎంపీ ల‌ను, ఎమ్మెల్యేల‌ను అదే ప‌నిగా
అవ‌మానిస్తూ వ‌స్తున్నారు. టీడీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ క‌నుస‌న్న‌ల్లోనే
ఆయ‌న ప‌నిచేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. 

నిస్సిగ్గుగా భూమా కుటుంబం మీద క‌క్ష సాధింపు

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎమ్మెల్యే భూమా
నాగిరెడ్డి మీద క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగారు. ఆయ‌న కుమార్తె, యువ ఎమ్మెల్యే అఖిల
ప్రియ ఎన్నికల పోలింగ్ కేంద్రం ద‌గ్గ‌ర వేచి ఉండ‌గా పోలీసులు ఆమెను చుట్టు ముట్టారు.
దీని మీద ఆందోళన చెందిన భూమా నాగిరెడ్డి, పోలీసుల్ని ప్ర‌శ్నించారు. ఆ ఘ‌ట‌న‌కు రంగు
పులిమి ఎస్సీ ఎస్టీ  అట్రాసిటీ చ‌ట్టం కింద
కేసు పెట్టించారు. అప్ప‌టిక‌ప్పుడు అరెస్టు చేసి జైలుకి త‌ర‌లించారు. ఓపెన్ హార్ట్
స‌ర్జ‌రీ చేయించుకొన్న భూమా ఆరోగ్య పరిస్థితి బాగో లేక‌పోయిన‌ప్ప‌టికీ మెరుగైన చికిత్స
కోసం హైద‌రాబాద్ త‌ర‌లించేందుకు ఒప్పుకోలేదు. భూమా కుటుంబాన్ని వ‌దిలేది లేదంటూ జిల్లా
ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్ట‌డాన్ని పోలీసులు... తెలుగుదేశం తొత్తులుగా ఎలా వ్య‌వ‌హరిస్తున్నారో
అర్ధం అవుతుంది. 

న‌గ‌రిలో వివాదాస్ప‌ద క‌మిష‌న‌ర్‌

చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యేగా రోజా ఎన్నిక
కాగా, మునిసిపాలిటీ చైర్ పర్సన్గా పార్టీకి చెందిన కేజే శాంతి ఎన్నికయ్యారు. అక్కడ
కమిషనర్ గా వివాదాస్పద అధికారిని నియమించి కక్ష సాధింపు చర్యలకు దిగారు. క‌మిష‌న‌ర్
హోదాలో ప‌నిచేసేందుకు అర్హ‌త లేని వ్యక్తిని కావాల‌నే
నియ‌మించిన‌ట్లు అర్థం అవుతోంది. ఆయ‌న ద్వారా మునిసిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ మీద‌, ఎమ్మెల్యే
రోజా మీద అదే ప‌నిగా దాడుల‌కు పాల్ప‌డుతూ వ‌స్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో
పెట్టుకొని ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు న‌డుపుతున్న మంత్రాంగానికి క‌మిష‌న‌ర్ నిస్సిగ్గుగా స‌హ‌క‌రిస్తూ వ‌స్తున్నారు. తాజా
పోలీసుల దాడి కూడా ఇదే కోవ‌లో జ‌రిగిందే.

Back to Top