చంద్రబాబు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌

సమావేశాల ముగింపు సమయంలో వచ్చి ఏం చేస్తారు
బాబు ఢిల్లీ పర్యటన పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే
పుట్టినప్పటి నుంచి హోదా కోసం పోరాడుతున్నట్లు మాట్లాడడం విడ్డూరం
వైయస్‌ఆర్‌ సీపీకి క్రెడిట్‌ వస్తుందని స్టాండ్‌ మార్చిన చంద్రబాబు
అందరం కలిసి రాజీనామాలు చేసి తెలుగోడి సత్తా చూపిద్దాం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

ఢిల్లీ: చంద్రబాబు నాయుడికి మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఇంకో మూడు రోజుల్లో పార్లమెంట్‌ ముగుస్తున్న సమయంలో ఏం సాధిద్దామని ఢిల్లీకి వచ్చారని ప్రశ్నించారు. బాబు ఢిల్లీ పర్యటన కేవలం పబ్లిసిటీ స్టంట్‌ తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. ఈ మేరకు పార్లమెంట్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో వైయస్‌ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ నీరుగార్చిందని, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నాటి నుంచి హోదా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలతో ఉద్యమం ఉధృతం కావడంతో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో స్టాండ్‌ మార్చుకున్న చంద్రబాబు పుట్టినప్పటి నుంచి హోదా కోసం పోరాడుతున్నట్లుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

కొత్తడ్రామాలు..

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం నుంచి వైయస్‌ఆర్‌ సీపీ లోక్‌సభలో పోరాటాన్ని ఉధృతం చేసిందని, 16వ తేదీన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని వైయస్‌ అవినాష్‌రెడ్డి గుర్తు చేశారు. అన్ని జాతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి ఎక్కడ క్రెడిట్స్‌ వస్తాయోనని.. చంద్రబాబు అప్పటికప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి అవిశ్వాసం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గ్రహించారన్నారు. మళ్లీ ఇప్పుడు మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తాయనంగ వచ్చి కొత్త డ్రామాలు ఆడుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నారన్నారు. 

చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయించాలి

టీడీపీ ఎంపీలు కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వచ్చి రాజీనామాలు చేయాలని వైయస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. రాజీనామాలు చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఏపీ భనవ్‌లో అందరం కలిసి నిరాహారదీక్ష చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్ని, తెలుగోడి సత్తాం ఏంటో కేంద్రానికి చూపిద్దామన్నారు. 29 సార్లు ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల గురించే చర్చించారని, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా విషయంలో లేదన్నారు. కనీసం ఇప్పుడైనా ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top