వైయస్‌ జగన్‌ను కలిసిన విద్యార్థి విభాగం నేతలు

మడకశిర: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మడకశిర నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు గురువారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల, కళాశాల కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయాలని వైయస్‌ జగన్‌ తమకు సూచించారని జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి డీ మంజునాథ్‌ తెలిపారు. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు.  వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో విద్యార్థి నాయకులు రంగనాథ్, కాంతరాజు, గిరీష్, రామ్‌కిశోర్‌రెడ్డి, హిందూపురం యువ నాయకుడు ఉపేంద్రరెడ్డి తదితరులు  ఉన్నారు. 

Back to Top