అన్యాయంపై గ‌ళ‌మెత్తిన విద్యార్థులు

అనంత‌పురం:  కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా శ‌నివారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో నిరాహార‌దీక్ష‌లు చేప‌ట్టారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు దీక్ష చేప‌ట్టి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలపై నిప్పులు చెరిగారు. అనంత‌పురంలో నిర్వ‌హించిన దీక్ష‌ను పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని నాడు అన్యాయంగా విడ‌గొట్టి కాంగ్రెస్ ఘోర త‌ప్పిదానికి పాల్ప‌డ‌గా, ఏపీకి ఇస్తామ‌న్న ప్రత్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేసింద‌ని మండిప‌డ్డారు.


విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌త్యేక‌హోదా, విశాఖ రైల్వే జోన్‌, వెనుక‌బ‌డిన ప్రాంతాలకు ప్ర‌త్యేక ప్యాకేజీ వంటి అంశాల‌కు కేంద్ర‌ బ‌డ్జెట్‌లో చోటు ద‌క్క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌న్న చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌లేద‌న్నారు. తిరుప‌తి ఎస్‌కే యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన నిరాహార దీక్ష‌లో విద్యార్థులు బాబు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Back to Top