ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యం
అనంత‌పురం: ప‌్ర‌త్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని, హోదా సాధ‌నే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా గురువారం ఎస్కేయూ వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, తిరుపాల్‌నాయక్, శ్రీనివాసరెడ్డి, వెంకటేష్‌యాదవ్, హేమంత్, రాజారెడ్డి, ఎల్లనూరు అనిల్‌కుమార్, కిరణ్‌కుమార్, అశోక్‌యాదవ్‌ తదితరులు వైయ‌స్‌ జగన్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. రెండు, మూడు పీజీలు చేసినా రాష్ట్రంలో ఉద్యోగాలు రావ‌డం లేద‌ని, ఒక్క నోటిఫికేష‌న్ కూడా టీడీపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌లేద‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదాతో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ఉంటాయ‌ని, ఇందుకోసం ముందుండి పోరాటం చేయాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. ఈ నెల 20న త‌ల‌పెట్టిన చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని విద్యార్థి సంఘాల నాయ‌కులు ప్ర‌తిప‌క్ష నేత‌ను కోరారు. విద్యార్థి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.   Back to Top