దుర్గారావుది ప్రభుత్వ హత్యే


అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దుర్గారావుది ప్రభుత్వ హత్యేనని వైయస్‌ఆర్‌సీపీ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటంలో అమరుడైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దుర్గారావు మృతికి సంతాపంగా గురువారం అనంతపురం పట్టణంలో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి యూనియన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఈ నెల 24న బంద్‌ నిర్వహిస్తే..చంద్రబాబు పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించారన్నారు. దీంతో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని వారు విమర్శించారు. కేసుల భయంతో చంద్రబాబు హోదానను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని చంద్రబాబు అణచాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అన్నారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని ఉద్యమాన్ని ఉక్కుపాదం మోపారన్నారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
Back to Top