తండ్రిని మించిన తనయుడిగా అభివృద్ధి చేస్తాడు



వైయస్‌ జగన్‌ను చూస్తుంటే వైయస్‌ఆర్‌ గుర్తొస్తున్నారు
జగనన్న సీఎం అయితేనే మాకు ఉద్యోగాలు వస్తాయి: విద్యార్థిని
విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తుంటే ఆయన తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తున్నారని యలమంచిలి నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. 248వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా యలమంచిలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు మహిళలు, విద్యార్థినులు పెద్ద ఎత్తున తరలివచ్చి జననేతను కలిశారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ మాట్లాడుతున్న తీరు, ఆయన ప్రకటిస్తున్న పథకాలు చూస్తుంటే ప్రజలపై ఆయనకున్న అభిమానం చాటుతుందన్నారు. జననేత సీఎం అయితేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. తండ్రిని మించిన తనయుడిగా పనులు చేస్తారనే నమ్మకం ఉందన్నారు. సీఎంగా వైయస్‌ జగన్‌ను తప్ప మరే వ్యక్తిని చూడటానికి ఇష్టపడమన్నారు. 

చంద్రబాబు పాలనలో ఉద్యోగాల కల్పన శూన్యమని ఓ విద్యార్థిని అన్నారు. టీడీపీ పాలనలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని ఎదురుచూస్తున్నామని, టెట్‌ రెండు సార్లు నిర్వహించారు కానీ నోటిఫికేషన్‌ విడుదల కాలేదన్నారు. కొత్తవారికి అర్హత లేదని చెబుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, మాకు ఉద్యోగాలు వస్తాయని విద్యార్థిని ధీమా వ్యక్తం చేసింది. 
 
Back to Top