వైయస్‌ జగన్‌ను కలిసిన విద్యార్థులు


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ను కలిసిన రాయవరం జూనియర్‌ కళాశాల విద్యార్థులు కలిశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను రాయవరం వద్ద విద్యార్థులు కలిసి తమ కాలేజీ భవనం మార్చాలని వినతిపత్రం అందజేశారు. కాలేజీ పంట పొలాల మధ్య ఉండటంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు పడితే కాలేజీకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దామని విద్యార్థులకు వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తామంతా జగనన్న వెంటే ఉంటామని, కాబోయే సీఎం జగన్‌ అంటూ నినదించారు.
 
Back to Top