అన్నొస్తున్నాడ‌ని అంద‌రికీ చెప్పండి



చిత్తూరు: చదువే అభివృద్ధికి మార్గమని, చాలా సమస్యలకు పరిష్కారమని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే మార్గమని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చ‌దువుల విప్ల‌వం తెస్తాన‌ని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను మెరుగు ప‌రిచి, పేద విద్యార్థుల‌ను డాక్ట‌ర్లు, ఇంజ‌నీర్లు చేస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. అన్నొస్తున్నాడ‌ని, మ‌నంద‌రిని చ‌దివిస్తాడ‌ని అంద‌రికీ చెప్పాల‌ని జ‌న‌నేత విద్యార్థుల‌కు సూచించారు. గురువారం కారెవాండ్ల‌ప‌ల్లి వ‌ద్ద ఆచార్య ఎన్‌జీ రంగా ఇంజినీరింగ్ విద్యార్థులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. త‌మ‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంద‌డం లేద‌ని, నిబంధ‌న‌ల పేరుతో స్కాల‌ర్‌షిప్‌ల్లో కోత విధిస్తున్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ విద్యార్థుల‌కు భ‌రోసా క‌ల్పించారు. చంద్రబాబు పాలనలో పిల్లలు చదువుకునే పరిస్థితులు లేవు. ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదవాలంటే ఫీజు లక్ష రూపాయలు దాటుతుండగా… ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే రూ.35 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇస్తుందో, ఇవ్వదో కూడా తెలియదు. మిగిలిన డబ్బులు పేదవారు ఎక్కడ నుంచి తేవాలి? వారి పిల్లలు ఉన్నత విద్య ఎలా చదవాలి? అందుకే మనం అధికారంలోకి రాగానే పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ‘అమ్మ ఒడి’అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడతాం. ఇద్దరు పిల్లలను బడికి పంపించే ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు అక్క, చెల్లెమ్మల చేతికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే కడుతుంది. ఫీజులు కట్టడంతో పాటు ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థులకు ఖర్చులకు మరో రూ.20 వేలు ఇస్తాం. అలా చేయడం వల్ల ఆ పిల్లలు గొప్పగా చదువుకుంటారు. ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ప్రత్యేకహోదా రావాలి. దాని సాధనకు మీరంతా కలిసిరావాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. జ‌న‌నేత హామీతో విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top