జననేతకు మద్దతుగా వందలాది మంది విద్యార్థుల చేరికలు

కర్నూలు(బనగానపల్లె))రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి మద్దతుగా వందలాది మంది విద్యార్థులు పార్టీ విద్యార్థి విభాగంలో చేరారు. బనగానపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ కాటసాని రామిరెడ్డి విద్యార్థులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని విద్యార్థులు, యువత విశ్వసిస్తున్నారు.

Back to Top