మోసగాడి పాలనలో అన్యాయమైపోయాం..!

తిరుపతిః చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓమోసగాడి పాలనలో తాము తీవ్రంగా మోసపోయామని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన యువభేరి సదస్సులో ఓ విద్యార్థి ఆవేదన వెళ్లగక్కాడు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని విస్మరించి మోసం చేశాడని  వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన అవగాహన సదస్సులో తేజస్ అనే విద్యార్థి వాపోయాడు.   

రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, యువకులకు ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మాటలు విని తనలాంటి విద్యార్థులు, తమ కుటుంబసభ్యులు, రైతులు ఇలా అందరూ అన్యాయమైపోయారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చే వరకు విద్యార్థిలోకం విశ్రమించబోదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాడుతామని  స్పష్టం చేశారు. 
Back to Top