వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆందోళ‌న‌


విశాఖ‌ప‌ట్నం) విశాఖ లోని ఆంధ్ర యూనివ‌ర్శిటీ తెలుగు విభాగం కార్యాల‌యం ఎదుట వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న జ‌రిగింది. హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ విద్యాల‌యం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విద్యా పీఠాల్ని వ‌దిలి పెట్టి ప్ర‌వేశ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌టానికి నిర‌స‌న‌గా ఆందోళ‌న చేశారు. ఈ వ్య‌వ‌హారం ఇంత ముదురుతున్నా తెలుగుదేశం ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విద్యార్థి నాయ‌కులు ఆరోపించారు. విద్యార్థుల భ‌విష్య‌త్ ఆందోళ‌న క‌రంగా మారుతున్న‌ప్ప‌టికీ స్పందించ‌టం లేద‌ని ఆవేద‌న వెలిబుచ్చారు. రాజ‌మండ్రి కేంద్రంగా తెలుగు విశ్వ విద్యాల‌యం ఏర్పాటుకి చొర‌వ తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top