హోదా కోసం విద్యార్థుల గ‌ర్జ‌న‌

- రాష్ట్ర‌వ్యాప్తంగా మాన‌వ‌హారాలు
- క‌దం తొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్ యూనియన్‌
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు గ‌ర్జించాయి. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ నిన‌దించారు. బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు క‌దం తొక్కారు.  ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని, హోదా ఇస్తేనే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. 
Back to Top