తొలి ఓటు వైయస్‌ జగన్‌కే

తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పలువురు విద్యార్థులు కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు. శనివారం రామచంద్రాపురం నియోజకవర్గంలో బీటెక్‌ విద్యార్థి సాయి త్రివేణి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చిందని, నా తొలి ఓటు వైయస్‌ జగన్‌కే వేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని ఆమె తెలిపారు. హోదా వస్తే మాలాంటి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే స్టూడెంట్స్‌ అందరికి స్కాలర్‌షిప్స్‌ వస్తాయని చెప్పారు. 
 
Back to Top