జ‌నం గుండెల్లో జ‌గ‌న్‌ మావయ్య


విశాఖ‌:  ప్రజాకంటక పాలనను అంతమొందించి రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వ‌ర్గాల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా జ‌న‌నేత‌ను క‌లుస్తూ త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లాలోకె. అమృత‌ అనే విద్యార్థిని వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి ఆయ‌న‌పై రాసిన క‌విత‌ను చ‌దివి వినిపించి మురిసిపోయింది. జ‌గ‌న్ అనే అక్ష‌రాల‌కు అర్థం చెబుతూ..జ‌నం గుండెల్లో వైయ‌స్ జ‌గ‌న్ మామ‌య్య ఉన్నార‌ని పేర్కొంది. ఆ చిన్నారి రాసిన క‌విత  ఇలా ..  ‘ జ: జనులందరి కోసం, గ:గుండెల్లో, న్‌:నువ్వున్నావు, ఆ పైనున్న భగవంతుడు, మీ నాన్నగారు దివంగత రాజశేఖర్‌ రెడ్డి గారు మిమ్మల్ని దీవిస్తున్నారని, ఆయుష్షు, ఆరోగ్యం, శక్తి మీ కుటుంబానికి నిండుగా ఉండాలని మేము ప్రతిదినం, ప్రతిక్షణం ప్రార్థిస్తూ ఉంటామంటూ’ కవితలో పేర్కొంది. జగన్‌ మురిపెంగా ఆ కవితను స్వీకరించి  ఆ చిన్నారిని దీవించారు.  


Back to Top