ప్రత్యేక హోదా కోసం నిరంతరపోరాటం


() మొదట నుంచీ
పోరాటబాటలో వైయస్సార్సీపీ

() దీక్షలు చేసిన
వైయస్ జగన్

() యువభేరిలతో అవగాహన
కల్పించిన జన నేత

హైదరాబాద్) ప్రత్యేక
హోదా అన్నది రాష్ట్రానికి సంజీవని అని గట్టిగా నమ్మిన పార్టీ వైయస్సార్సీపీ.
అందుకే ఆ అంశం మీద  మొదట నుంచి పోరాట బాటలో
సాగుతోంది.

ప్రత్యేక హోదాకు మూలం
ఇది..
!

రాష్ట్ర విభ‌జ‌నే అన్యాయం. ఆ అన్యాయం
చేస్తున్న స‌మయంలో సాక్షాత్తు దేశ పార్ల‌మెంటులో అప్ప‌టి ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ ఒక హామీ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అయిదేళ్ళు ప్ర‌త్యేక హోదా
ఇస్తాం అని కాంగ్రెస్ అంటే, కాదు ప‌దేళ్లు కావాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి
వ‌స్తే అయిదేళ్ళు కాదు - ప‌దేళ్ళు ప్ర‌త్యేక హోదా ఇస్తాం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్
ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఆ పార్టీ స్ప‌ష్టం చేసింది. తిరుపతి ఎన్నికల సభలో చంద్ర‌బాబు నాయుడు కూడా అయిదేళ్ళు చాల‌దు - ప‌దేళ్ళు కావాల‌ని
ఎన్నిక‌లకు ముందు - త‌రువాత చెప్పాడు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, ఆ పై బీజేపీ దీని విషయాన్ని పక్కన పెట్టేశాయి.

సా...............గతీత వైఖరి

ఇక్కడ టీడీపీ
అక్కడ ఎన్డీయే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచి పోయాయి. పార్ల‌మెంటులో మాట ఇచ్చి, అప్ప‌టి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి...
ప్ర‌ణాళిక సంఘానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వండ‌ని ఉత్త‌ర్వులు జారీ చేయటం జరిగింది. తర్వాత 2014 డిసెంబ‌రులో  ప్ర‌ణాళిక సంఘాన్ని ర‌ద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసే వ‌ర‌కు
కూడా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న సిఫార‌సు ఆచ‌ర‌ణ‌కు రాకుండా 8 నెల‌లు అలాగే ప‌డి
ఉంది. ఇప్పుడు 18 నెల‌లు 2 సంవత్సరాలు దాటిపోతున్నా ఎటువంటి పురోగతి కనిపించటం లేదు. ప్ర‌త్యేక హోదా ఊసులేదు... ఇస్తార‌న్న ఆశ లేదు. ఏపీకి ఎన్ని
అన్యాయాలు అయినా చేయ‌వ‌చ్చునన్న‌ట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కుమ్మ‌క్కు అయ్యాయి.

        అంత‌కు ముందు - 14వ ఆర్థిక సంఘం ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్ద‌న్న‌ద‌ని
అబద్ధం చెప్పారు. ఆర్థిక సంఘానికి అలా చెప్పే అధికార ప‌రిధే లేదు. ఆర్థిక సంఘం ప‌ని
కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య కేంద్ర పన్నుల్ని పంప‌కం చేయ‌టం, నాన్‌ప్లాన్
గ్రాంట్స్ అండ్ లోన్‌గా పంచ‌టం. ప్లాన్ గ్రాంట్లు, ప్లాన్ డెఫిసిట్ ఇచ్చే బాధ్య‌త ఆర్థిక
సంఘానికి కాదు. అదేర‌కంగా ప్ర‌త్యేక హోదా క‌లిగిన రాష్ట్రాల‌కు ఎంత మొత్తం
నిధులుగా ఇవ్వాలో ఒక ఫార్ములా లేదు. నిధుల‌ను గ‌త ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు
సంబంధించిన ప్ర‌ణాళిక వ్య‌యం, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ప్ర‌ణాళిక నిధుల ప‌రిమాణం
ఆధారంగా ఇస్తారు.

ప్ర‌త్యేక
హోదా ఇవ్వ‌టం కుద‌ర‌దంటూ కేంద్రంలో ఉన్న పెద్ద‌లు మ‌రో విచిత్ర‌మైన వాద‌న చేశారు -
మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఒరిస్సాలు అడ్డుకుంటున్నాయ‌ని సాకులు చెప్పారు. విభ‌జ‌న స‌మ‌యంలో
ఈ రాష్ట్రాలు లేవా? ఇప్పుడు ఆ రాష్ట్రాలు అడ్డుకొంటున్నాయ‌న‌టం భావ్య‌మా? ఎన్డీసీ అయినా, ప్ర‌ణాళికా
సంఘం అయినా, నీతి ఆయోగ్ అయినా, కేంద్ర క్యాబినెట్ అయినా... అన్నింటికీ ప్ర‌ధాన‌మంత్రే
అధ్య‌క్షుడు. ప్ర‌త్యేక హోదా అన్న‌ది కేవ‌లం క్యాబినెట్ నిర్ణ‌యం. అంటే
ఎగ్జిక్యూటివ్ డెసిష‌న్‌. గ‌తంలో ఏర్పాటు అయినా ఏ రాష్ట్రానికి అయినా అప్ప‌టి
కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం ద్వారానే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం జ‌రిగింది. అడ‌గాల్సింది
బాబు.... ఇవ్వాల్సింది కేంద్ర మంత్రిమండ‌లి. త‌ల‌చుకుంటే ఇది చిటికెలో ప‌ని!

హోదా కోసం గళమెత్తిన జన నేత

ఉద్దేశ పూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయం నీరు
కారుస్తుండటంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటాన్ని ఆరంభించారు. పార్టీ నాయకులతో
కలసి ఢిల్లీకి వెళ్లి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పార్లమెంటు పరిసరాల్లో
ప్రతిధ్వనించే మాదిరిగా వాణి వినిపించి వచ్చారు. తర్వాత గుంటూరు వేదికగా నిరవధిక
దీక్షను చేపట్టారు. అటు, యువత విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు తిరుపతి,
విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళంలలో యువ భేరి చేపట్టారు. స్వయంగా జన నేత వైయస్
జగన్ ఆయా నగరాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, యువత విద్యార్థుల్ని చైతన్య
పరిచారు. అటు పార్టీ ఎంపీలు నిరంతరాయంగా పార్లమెంటులో ప్రత్యేక హోదా మీద
పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు ముంగిటకు వస్తున్న
ప్రైవేటు బిల్లుకి మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. 

తాజా వీడియోలు

Back to Top