రైతులకు అన్యాయం చేస్తే ఆందోళనే

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వహక కమిటీ సభ్యులు జెమీలు 

విశాఖపట్నం: ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం
చేస్తే ఆందోళన చేపడుతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్య నిర్వహక
కమిటి సభ్యులు అంకంరెడ్డి జెమీలు హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా  నాతవరంలో    విత్తనాలు పంపిణీని కార్యక్రమాన్ని చేపట్టారు.
రైతులకు కావలసిన ఆర్‌జీఎల్‌ రకం విత్తనాలు లేకుండా మిగతా విత్తనాలు  పంపిణీ
చేసేందుకు ప్రయత్నాలు చేయటంపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు అవసరమైన ఆర్‌జీఎల్‌ రకం విత్తనాలు  బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడానికి
దాచుకున్నారా?
లేక వేరే కార ణం
చేత ఇవ్వటం లేదా అని సిబ్బందిని నిలదీశారు. వ్యవసాయాధికారి వచ్చి  సమాధానం
చెప్పి  విత్తనాలు  ఇవ్వాలని..  లేకుంటే అడ్డుకుంటామని  
రైతులు బీష్మీంచారు. సమస్య తీవ్ర స్దాయికి చేరే సమయంలో జెమీలు అక్కడకు చేరుకొని
 పరిష్కారం చేశారు. అనంతరం జెమీలు మాట్లాడుతూ  జిల్లాలో తాండవ
రిజర్వాయరు కింద నున్న నాతవరం మండలంలోనే అధిక విస్తీ్రర్ణంలో ఖరీప్‌లో వరి సాగు
చేస్తారన్నారు.  ఎక్కువ విస్తీ్రర్ణంలో సాగు  చేసే నాతవరం గ్రామంలోనే
ఆర్‌జీఎల్‌ రకం విత్తనాలు లేకపోవడం ఎంతవరకు సమాంజసమని ప్రశ్నించారు. అసలు
 సాగును బట్టిని రైతులకు విత్తనాలు ఎంత అవసమనేది వ్యవసాయాదికారులు ముందుగా
ప్రతిపాదనలు  చేయాలన్నారు. తర్వాత  రైతులకు సకాలంలో సక్రమంగా విత్తనాలు
 అందజేయాల్సిన భాద్యత  ప్రభుత్వంపై   ఉందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top