ప్రత్యేక హోదా మన హక్కు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వైయస్ జగన్ సూటి ప్రశ్నలు

హైదరాబాద్) ప్రత్యేక హోదా ను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు వెంటనే
ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్
డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రత్యేక హోదా మీద చర్చను జరగనీయకుండా తెలుగుదేశం అడ్డుకొన్న
తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీలో టీడీపీ అనుసరించిన విధానాల్ని ఆయన తప్పు పట్టారు. అర్థ రాత్రి పూట
అరుణ్ జైట్లీ ప్రకటన చేయటం, దాన్ని చంద్రబాబు స్వాగతించటాన్ని ఆయన తూర్పారబట్టారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుంటి సాకులు వెదకుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికైనా కేంద్రం నుంచి మంత్రుల్ని ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు
చేసిన చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అభిప్రాయ పడ్డారు.

అరుణ్ జైట్లీ ప్రకటనను వైయస్ జగన్ పాయింట్ల వారీగా విశ్లేషణ చేసి లోపాల్ని
బహిర్గతం చేశారు. చాలా ప్రయోజనాలు చేస్తున్నట్లుగా బిల్డప్పులు ఇచ్చారని వైయస్
జగన్ వివరించారు. అరుణ్ జైట్లీ మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని ఆయన
పేర్కొన్నారు. పోలవరం, ఆర్థిక సంఘం, వెనుకబడిన జిల్లాలకు నిదులు.. ఇలా అన్ని
విషయాల్లోనూ సక్రమంగా వ్యవహరించ లేదని పేర్కొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో
ఉన్న విషయాల్నే తిప్పి చెప్పారని వైయస్ జగన్ వివరించారు.

 

తాజా ఫోటోలు

Back to Top