చంద్ర‌బాబుకి ప్ర‌జ‌ల త‌ర‌పున‌ ప్ర‌శ్న‌లు..!

హడావుడిగా ఢిల్లీ వెళుతున్న చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌జ‌ల త‌రపున వైఎస్సార్‌సీపీ ప‌ది ప్ర‌శ్న‌లు వేస్తోంది. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. పార్టీ అధికార ప్ర‌తినిది, ఎమ్మెల్యే రోజా ఈ రోజు మీడియా స‌మావేశంలో ఈ ప్ర‌శ్నావ‌ళిని సంధించారు. 

1) ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో పూర్తిగా ఇరుక్కొనిపోయిన చంద్ర‌బాబు ఢిల్లీ వెళుతున్న‌ది దేనికోసం..! సీఎమ్ ప‌ద‌విని కాపాడుకోవ‌టానికా లేక ప్ర‌త్యేక హోదా తేవ‌టానికా..!
2) ప్ర‌త్యేక హోదా కు మీరు అనుకూల‌మా లేక వ్య‌తిరేక‌మా..! (ఎందుకంటే మీ మంత్రులు అదిగ‌దిగో ప్ర‌త్యేక హోదా అంటే, కేంద్ర మంత్రులు అబ్బే హోదా లేనే లేదు అంటున్నారు)
3) ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా.. లేక రాదా..! ఒక వేళ ప్ర‌త్యేక హోదా రాక‌పోతే మీ పార్టీ కేంద్రం నుంచి వైదొల‌గుతుందా, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి బీజేపీ మంత్రుల్ని త‌ప్పిస్తారా..!
4) మొద‌ట నుంచి స‌మాఖ్య వాదాన్ని బ‌ల‌ప‌రిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే విధానానికి క‌ట్టుబ‌డి ఉందా..! లేదా..!
5) ఆరు నెల‌లుగా విభ‌జ‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై ఎందుకు మీరు ఒత్తిడి తీసుకొని రావ‌టం లేదు..!
6) పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ను పెంచకుండా రూ.50 పెంపుతో స‌రిపెడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు
7) రాష్ట్రానికి రెవిన్యూ లోటు అధికంగా ఉంద‌ని తెలిసీ, కేంద్రం నుంచి సాయం అంద‌క‌పోతున్నాఎందుకు ప‌ట్టించుకోవటం లేదు..!
8) పోల‌వ‌రం ప్రాజెక్టుని ఎందుకు నొక్కి పెడుతున్నారు.
9) ఇప్ప‌టిదాకా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని ఎన్ని సార్లు క‌లిశారు.. ఏ ప్ర‌తిపాద‌న‌లు అందించారు. దీని మీద శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌గ‌ల‌రా..!
10) నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో ఇప్ప‌టిదాకా 11 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొంటే విచార‌ణ క‌మిటీ నివేదిక‌లు ఎందుకు దాస్తున్నారు..

ఈ ప్ర‌శ్న‌ల‌కు సూటిగా జ‌వాబు ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల త‌ర‌పున వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.

తాజా ఫోటోలు

Back to Top