ప‌ట్టిసీమ పేరుతో హ‌డావుడి

చంద్ర‌బాబు మార్కు హ‌డావుడి
తాటిపూడి జలాశ‌యం నుంచి నీటి విడుద‌ల‌
పోల‌వ‌రం కుడి కాల్వ మీదుగా నీటి ప్ర‌వాహం

హైదరాబాద్‌: ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం మీద చంద్ర‌బాబు కొత్త నాట‌కానికి తెర దీశారు. అదిగ‌దిగో నీళ్లు అంటూ హ‌డావుడి చేస్తున్నారు. తాటిపూడి జ‌లాశ‌యం నుంచి నీటిని వ‌దిలి అనుసంధానం పూర్త‌యింది అనిపించారు.

ప‌ట్టిసీమ పై బోలెడు ప్ర‌చారం
ప‌ట్టి సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం గురించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చాలా ప్ర‌చారం చేసుకొంది. ఈ ప‌థ‌కాన్ని పూర్తి చేసి చ‌రిత్ర పుటల్లో నిలిచిపోతామంటూ లెక్క‌లేన‌న్ని విష‌యాలు చెప్పారు. గోదావ‌రి నుంచి నీటిని కృష్ణా న‌దికి త‌ర‌లిస్తామ‌ని, ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి నీళ్లు రాయ‌ల‌సీమ‌కు చేరుస్తామ‌ని అంత‌టితో రాయ‌ల సీమ సస్య శ్యామ‌లం చేస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. త‌ద్వారా రాయ‌ల‌సీమ జ‌ల ప్ర‌దాత‌గా చంద్ర‌బాబు చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని తెలుగు త‌మ్ముళ్లు ఢంకా బ‌జాయించారు.

శిలా ఫ‌ల‌కంతో జాతికి అంకితం
ప‌ట్టి సీమ ప‌థ‌కాన్ని ఆగ‌స్టు 15 నాటికి పూర్తి చేస్తామ‌ని ప్ర‌భుత్వం హ‌డావుడి చేసింది. ఏడాదిలోగా ప‌ని పూర్తి చేస్తే కాంట్రాక్ట‌ర్ కు 16.9 శాతం అద‌నంగా బోన‌స్ చెల్లిస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. ఈ మాట నెగ్గించేందుకు , ప‌నులు పూర్తి కాక పోయినా హ‌డావుడిగా ఆగ‌స్టు 15న జాతికి అంకితం చేశారు. ప‌నులు కాక‌పోయినా, ఒక చుక్క నీరు విడుద‌ల కాక‌పోయినా చంద్ర‌బాబు శిలాఫ‌ల‌కం ఆవిష్క‌రిస్తే, దానికి తెలుగు త‌మ్ముళ్లు చ‌ప్పట్లు కొట్టారు.

తాటిపూడి నుంచి నీటి విడుద‌ల‌
ఇప్పుడు తాటిపూడి జ‌లాశ‌యం నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. అక్క‌డ నుంచి నీరు పోల‌వరం కుడి కాల్వ‌లోకి పంపించారు. అక్క‌డ నుంచి కృష్ణా న‌దికి నీరు చేరేట్లుగా ప్ర‌ణాళిక ర‌చించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఈ ప‌నుల్లో హెచ్చు శాతం దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో సాకారం అయిన‌వే. ఆయ‌న క‌ల‌ల పంట‌గా ప‌శ్చి మ గోదావ‌రి జిల్లాలో తాటిపూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం రూపు దిద్దుకొంది. అటు పోల‌వ‌రం కుడి కాల్వ నుంచి గోదావ‌రి మిగులు జ‌లాల్ని కృష్ణా న‌దిలోకి మ‌ళ్లించేందుకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో పథ‌కాలు రూపొందించారు. 

ప‌థ‌కం ఒక‌రిది.. ప్ర‌చారం మ‌రొక‌రికి..!
మొత్తం మీద నీటిని విడుద‌ల చేసిన‌ట్లుగా ప్ర‌చారం అయితే చేయించుకొంటున్నారు. కానీ నీటి విడుద‌ల కు మూలం అయిన దివంగ‌త నేత‌ను ప‌క్క‌న పెట్టేశారు. అంత‌కు మించి నీటిని నిల్వ చేసుకొనే ఏర్పాటు చేసుకోకుండా పంతానికి పోయి నీటిని తీసుకెళ్లితే రెండు ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టిన‌ట్ల‌వుతుంద‌న్న మాట‌ను వినిపించ‌టం లేదు. 

తాజా వీడియోలు

Back to Top