సింగపూర్ తో నీ సంబంధమేంటో బయటపెట్టు..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నేత అనంత వెంకట్రాంరెడ్డి  చంద్రబాబుపై మండిపడ్డారు. ఏపీ రాజధానిని సింగపూర్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందన్నారు. పార్టీ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ..ఆయనో గోముఖ వ్యాఘ్రమని విమర్శించారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చుపెట్టడం లేదని వెంకట్రాంరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర నిధులు ఖర్చుపెడితే సింగపూర్ నుంచి కంపెనీలు రావని భయమా అని నిలదీశారు. చంద్రబాబుకు, సింగపూర్ కు మధ్య ఉన్న సంబంధమేంటో బయటపెట్టాలని అనంతవెంకట్రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top