టీడీపీ నాయకుడు భూ కబ్జాలను అపాలి

ప్రోత్సహిస్తున్న విఆర్‌వోపై చర్యలు తిసుకోవాలి..
– ముంచంగిపుట్టు వైయస్సార్సీపీ నాయకులు డిమాండ్‌

ముంచంగిపుట్టు: ముంచంగిపుట్టు మండల కేంద్రంలో టీడీపీ నాయకుడు స్దానిక సర్పంచ్‌ అయిన  కిల్లో లరాం భూకబ్జాలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని వైయస్సార్‌సిపి మండల అద్యక్షులు అరిసెల చిట్టిబాబు,స్దానిక ఎంపిటిసి సభ్యుడు కె.గాసిరావులు అగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం గిరిజన ఉద్యోగులకు స్దలం కేటాయించిందని దానిని ఇద్దరు టీడీపీ నాయకులు కబ్జాచేసి పాకలు వేసారన్నారు. ఈ విషయం గ్రహించిన బాధితులు  షాకుకు గురై వైయస్సార్‌సిపి నాయకులను అశ్రయించారని ఆయన తెలిపారు. అయితే ఈ విషయంపై స్దానిక రెవిన్యూ అధికారులకు సంప్రదించగా ఒక టీడీపీ నాయకుడు, సర్పంచ్ బినామీ దారుడు పేరిట ఎల్‌పిసి మంజురైనట్టు తెలిసింది అన్నారు. స్దానిక సర్పంచ్‌ బలరాం, వీఆర్వో కోటిబాబులు కుమ్మకై భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
Back to Top