రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారే: భూమన

తిరుపతి 16 ఆగస్టు 2013:

చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా గాంధీ బొమ్మ సర్కల్‌లో  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం మంచి నీళ్ల దీక్షకు దిగారు. ఎమ్మెల్యేతో పాటు వందలాది మంది మహిళలు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారవుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సాగు నీరే కాకుండా తాగునీటికి కూడా కరవేర్పడుతుందన్నారు. రాయలసీమకు చుక్క నీరు కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇంతటి జటిల సమస్యలు ఉన్నా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. సీట్ల కోసం సోనియా గాంధీ కపట నాటకమాడుతోందని విమర్శించారు. విభజనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు  లేఖ ఇచ్చి సీమాంధ్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నాడని ఎమ్మెల్యే భూమన ఘాటుగా విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top