రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు..!

వైఎస్ జగన్ కు మద్దతుగా ...!
గుంటూరుః వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకహోదా డిమాండ్ తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ కు సంఘీభావంగా వివిధ జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే దీక్షలు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా :
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో గుత్తి, గుంతకల్లు, పామిడిలో...మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం, కనేకల్, బొమ్మనహళ్, హీరేహళ్ మండలాల్లొ  రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రిలే దీక్షలు.
వైఎస్ఆర్ జిల్లా :
జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే జి.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో  రామాపురం మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.  ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జరిగిన రిలే దీక్షలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో  సర్పంచ్ లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా..
పలమనేరులో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో , బంగారుపాలెంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డీ ఆధ్వర్యంలో అదేవిధంగా రామకుప్పం సహా వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

నెల్లూరు జిల్లా:
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా  రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోవూరులో వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కావలిలో నిరసన దీక్షలు చేపట్టారు. గూడూరులో స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్, మరో నేత గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ గ్యాస్ సెంటర్ వద్ద నిరసన దీక్షలు... భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి సంఘం చేపట్టిన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించగా..నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చేటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ప్రకాశం జిల్లా :
కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి, పామూరు, హెచ్ ఎంపాడు, పీసీ పల్లి, సీఎస్ పురం మండలాల్లో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు .

కృష్ణాజిల్లా :
జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యలో హనుమాన్ జంక్షన్ లో కార్యకర్తల రిలే దీక్షలు చేపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో 1100 మంది కార్యకర్తలు...నల్లపాడు తరలివెళ్లారు.

పశ్చిమగోదావరి జిల్లా :
పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఉండి నియోజకవర్గం నుంచి గుంటూరుకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా కదం తొక్కారు. యలమంచిలి మండలం చించినాడలో పొత్తూరి బుచ్చిరాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. వైఎస్ఆర్ సీపీ నేత గ్రంధీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమవరం నుంచి ర్యాలీగా గుంటూరు నేతలు, కార్యకర్తలు నల్లపాడుకు తరలారు. పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా :
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా భానుగుడి సెంటర్ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా జగన్ దీక్ష విజయవంతం కావాలని కోరుతూ కాకినాడ నియోజకవర్గ కన్వీనర్ బి.వేణుగోపాలకృష్ణ స్థానిక శ్రీపీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టారు.

తాజా వీడియోలు

Back to Top