రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

() ఎమ్మెల్యే రోజాకు బాసటగా వైఎస్సార్సీపీ

() రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు

() పచ్చ పార్టీ పైశాచికత్వం మీద నిరసన

హైదరాబాద్) మహిళా ఎమ్మెల్యే రోజాను శాసనసభలోకి రానీయకుండా తెలుగుదేశం
ప్రభుత్వం అడ్డు పడుతున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
మిన్నంటుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల మహిళా సంఘాల ఆధ్వర్యంలో
ఆందోళనలు జరిగాయి.


      అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా
తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయించారు.
దీని మీద న్యాయపోరాటం చేసిన ఎమ్మెల్యే రోజా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొన్నారు.
అయినప్పటికీ అధికార మదంతో తెలుగుదేశం ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేను సభలోకి రానీయటం
లేదు.


      చంద్రబాబు ప్రభుత్వ దురహంకార
వైఖరి మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. మహిళాసంఘాలు, ప్రజా సంఘాలు ఆమెకు
బాసటగా నిలుస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య యుతంగా
ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

Back to Top