రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీకి తాకట్టు

హైదరాబాద్ః చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఢిల్లీకి తాకట్టుపెడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం మండిపడ్డారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తుంటే...చంద్రబాబు మొద్దు నిద్ర వహిస్తున్నారని దుయ్యబట్టారు. అందరినీ కలుపుకుని వెళ్లి కేంద్రాన్ని నిలదీసే కార్యక్రమం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.  ఏనాడైనా ప్రజల బాగోగుల కోసం ఒక్క అఖిలపక్ష సమావేశాన్నైనా పెట్టారా బాబు అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డబ్బులు లేవని బీద అరుపులు అరుస్తూ ...ఢిల్లీలో బాబు మోడీ పాద సేవ చేస్తున్నారని ఫైరయ్యారు. పోలవరానికి కేవలం రూ. 100 కోట్లు పడేశారన్నారు.  రాజధాని కట్టాల్సిన కేంద్రం చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టి మొహాన కొట్టిపోతే...చంద్రబాబు చోద్యం చూస్తున్నారని నిప్పులు చెరిగారు.

Back to Top