టీడీపీ హయాంలో రాష్ట్రం అవినీతి మ‌యం

నెల్లూరుః అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్నిఅవినీతిమ‌యం చేస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి అధికారుల‌ను త‌న కనుసన్నల్లో ఉంచుకొని సోద‌రుడికి తెల్ల‌రేష‌న్ కార్డు మంజూరు చేయడం దారుణమన్నారు. రేష‌న్‌కార్డులు లేక పేద ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే పట్టించుకోకుండా... అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే సోద‌రుడికి తెల్ల‌రేష‌న్ కార్డు ఎలా మంజూరు చేస్తార‌ని న‌ల్ల‌పురెడ్డి అధికారుల‌ను ప్ర‌శ్నించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అధికార యంత్రంగం ఎమ్మెల్యే క‌నుస‌న్న‌ల్లో ప‌ని చేస్తుంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో అవినీతికి పాల్ప‌డుతూ టీడీపీ నేత‌లు డ‌బ్బులు దండుకుంటున్నార‌ని ఆరోపించారు. టీడీపీ నేత‌ల అవినీతిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. 
Back to Top