ఈనెల 28న సమీక్షా సమావేశం

హైదరాబాద్ః ఈనెల 28న లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లుగూరి అమృతసాగర్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమీక్షా సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, మండల స్థాయి కమిటీల నియామకంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా కమిటీల అధ్యక్షులు ఈ భేటీకి హాజరవుతారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

Back to Top