నంద్యాల గెలుపును వైయస్ జగన్‌కు కానుకగా ఇస్తా

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే గెలుపని పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీవైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శిల్పా కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల గెలుపును వైయస్‌ జగన్‌కు బహుమతిగా ఇస్తానన్నారు. 

వైయస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా శిల్పా మోహన్ రెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం ఆయనకు నంద్యాల టికెట్ ను కూడ ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.  
Back to Top