విజయవాడలో విజయమ్మ దీక్ష వేదిక ఖరారు

విజయవాడ 16 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ నెల 19వ తేదీ నుంచి విజయవాడలో చేపట్టనున్న నిరవధిక దీక్షకు వేదిక ఖరారైంది. బందరు రోడ్డులోని పీవీపీ కాంప్లెక్సు  ఎదురుగా ఆమె దీక్ష చేపడతారని పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, గౌతమ్ రెడ్డి శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే ఏకైక లక్ష్యంతో శ్రీమతి విజయమ్మ సమరభేరీ దీక్ష చేపట్టనున్నారని వారు తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి, సీమాంధ్ర ప్రజలను  చులకనగా చూస్తోందని ఆరోపించారు. సీమాంధ్రుడిగా చంద్రబాబుకు పౌరుషం ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చంద్రబాబు పాల్గొనాలని సూచించారు. తెలుగు దేశం నుంచి వలసలు నిరోధించి, పార్టీని కాపాడేందుకే బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఉదయభాను, జలీల్ఖాన్, గౌతమ్రెడ్డి ఎద్దేవా చేశారు.

Back to Top