ఓటర్లకు విజయమ్మ కృతజ్ఞతలు

హైదరాబాద్ :

పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద మెజారిటీ స్థానాల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుదారులను గెలిపించినందుకు పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీపై ‌పల్లె ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులను కలుపుకొని తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ మద్దతుదారులను అత్యధిక పంచాయతీల్లో గెలిపించినందుకు ప్రజలకు శ్రీమతి విజయమ్మ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Back to Top