వైయస్సార్సీపీలోకి మాజీ డీసీబీ చైర్మన్

హైదరాబాద్ః తూర్పుగోదావరి జిల్లా నుంచి వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పోరాటాలు, నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు వైయస్సార్సీపీలో చేరుతున్నారు.  రాజమండ్రి మాజీ DCB చైర్మన్ ఆకాశం శ్రీరామచంద్ర మూర్తి వైయస్సార్సీపీలో చేరారు. వైయస్ జగన్ సమక్షంలో  ఆయన నివాసంలో రామచంద్రమూర్తి, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ రామచంద్రమూర్తిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. పార్టీ కండువా వేసి సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ నేతలు కన్నబాబు. చలమశెట్టి సునీల్, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top